avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 13:00
రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చి వెళ్లిన @ysjagan

గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చేశారు. 15 నెలలుగా ఈ చెత్తను శుభ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. 150 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గత పాలకులు వదిలేసి వెళ్లారు. ఇప్పటికే 114 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించాం. జూన్ నాటికి వందశాతం చెత్తను సేకరించి వ్యర్థాలను సంపదగా మారుస్తాం.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 463
avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 12:07
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్. తల్లిదండ్రులు దాతల సాయం కోరడంతో రూ.10కోట్లు సమకూరాయి. ఆ సమయంలో విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ మిగిలిన 6కోట్ల సంగతి తనకు వదిలేయమన్నారు. ఆ క్షణం నుంచి అన్నివిధాలా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్‌కు ర‌ప్పించే ప‌నిని త‌న సిబ్బంది ద్వారా నిరంత‌రం లోకేష్ గారు ప‌ర్య‌వేక్షించారు. ఈరోజు దగ్గరుండి మరీ పాపకు ఇంజక్షన్ ఇప్పించారు. పున‌ర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో నిండు ప్రాణాలు నిలిచాయి. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగంతో చెప్పారు.
#Punarvika
#NaraLokesh
1 475
avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 11:48
రిజర్వేషన్ల బిల్లును ఓడించి మహిళల పట్ల ప్రతిపక్షాలు ద్రోహానికి పాల్పడ్డాయి. ప్రజా చైతన్యం ద్వారా మహిళలకు రిజర్వేషన్ కల్పించే బాధ్యతను ఎన్డీఏ తీసుకుంటుంది. ఈ ఉద్యమం నిడదవోలు నుంచి ప్రారంభమైంది.
#NariShaktiVandan
#SthreeShakti
#ChandrababuNaidu
#AndhraPradesh
1 467
avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 11:28
నిడదవోలు నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం.
#CBNWithCadre
#ChandrababuNaidu
#AndhraPradesh
1 394
avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 16:02
అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ (SMA TYPE-1) వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే చిన్నారి వైద్యానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ అందించిన భారీ ఆర్ధిక సాయంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్నారి పునర్విక సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఉండాలంటే విదేశాల నుంచి రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ తెప్పించి ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. అందుకోసం ఎంతో మంది దాతలు ఆర్ధిక సాయం అందించారు. అది రూ.10 కోట్ల వరకూ వచ్చింది. విషయం తెలుసుకున్న శ్రీ నారా లోకేష్ అవసరమైన మరో రూ.6 కోట్లు తానే అందిస్తానని పునర్విక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దాంతో జోల్ జెన్ స్మా అనే జీన్ థెరపీ ఇంజెక్షన్ ను అమెరికా నుంచి వైద్యుల పర్యవేక్షణలో తెప్పించి హైదరాబాద్ లోని రెయిన్ బో పిల్లల ఆసుపత్రిలో చిన్నారి పునర్వికకు ఇచ్చారు. ఆ సందర్భంలో శ్రీ నారా లోకేష్ కూడా ఆసుపత్రిలో పునర్విక తల్లిదండ్రులకు సాయంగా ఉన్నారు. ధైర్యం చెప్పారు. చికిత్స అనంతరం చిన్నారి పునర్వికను కొద్ది సేపు ఎత్తుకుని లాలించారు. ఈ అంశాన్ని మంత్రి శ్రీ నారా లోకేష్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ‘చిన్నారి పునర్విక క్షేమంగా ఉంది’ అనే సందేశాన్ని పోస్టు చేశారు. చిన్నారి పునర్వికకు ఆయన చేసిన సాయంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు దీన్ని భరించలేక తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన డబ్బులతో మంత్రి శ్రీ లోకేష్ తన స్వీయ ప్రచారం చేసుకుంటున్నారనే తప్పుడు వార్తను పోస్టు చేశారు. సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) నుంచి గానీ, మరేఇతర ప్రభుత్వ శాఖ నుంచి గానీ మంత్రి శ్రీ నారా లోకేష్ ఈ నిధులను సేకరించలేదు. కేవలం తన సొంత వనరుల నుంచి మాత్రమే రూ.6 కోట్లు సమీకరించారు. సాయం చేసిన వారిని విమర్శించేందుకు సాకులు వెతకడం వారి సంస్కారాన్ని తెలుపుతున్నది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.
32
avatar
Telugu Desam Party
@Jai_TDP
18.04.2026 15:45
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కందుల దుర్గేష్ గారు, రామానాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి గారు, పలువురు నేతలు, అధికారులు.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1 73

Telugu Desam Party

15.4K
Official account for TDP Broadcasts
Открыть в Telegram